నవతెలంగాణ – వనపర్తి
జనవరి 25 నుండి 28 వరకు హైదరాబాదు ఆర్టీసీ కళ్యాణ మండపం వద్ద జరగనున్న ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం) ఆల్ ఇండియా మహాసభలను జయప్రదం చేయాలని తెల్ల రాళ్లపల్లి గ్రామంలో పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని ఐద్వా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సాయి లీల ముఖ్య అతిథిగా పాల్గొని పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం, భద్రత, సమాన హక్కులు వంటి అంశాలపై చర్చించేందుకు ఐద్వా ఆల్ ఇండియా మహాసభలు ఎంతో కీలకమని తెలిపారు. మహిళలపై పెరుగుతున్న దాడులు, వివక్ష, అన్యాయ విధానాలకు వ్యతిరేకంగా ఐద్వా నిరంతరం పోరాడుతోందని ఆమె గుర్తు చేశారు.
జనవరి 25 న హైదరాబాదులో జరిగే బహిరంగ సభలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ హక్కుల కోసం గళమెత్తాలని, *25 నుంచి 28 వరకు జరిగే మహాసభలను విజయవంతం చేయాలని సాయి లీల గారు పిలుపునిచ్చారు*. మహిళల ఐక్యతే సమాజ మార్పుకు ప్రధాన బలమని ఆమె అన్నారు.
ఈ పోస్టర్ విడుదల కార్యక్రమంలో ఐద్వా నాయకులు, కార్యకర్తలు, గ్రామ మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఆల్ ఇండియా మహాసభలకు సంపూర్ణ మద్దతు తెలిపారు. మహాసభలను జయప్రదం చేయాలని నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యురాలు పావని గ్రామ కమిటీ సభ్యులు సాయమ్మ సుశీల దేవమ్మ కవిత శాంతమ్మ లక్ష్మీ వెంకటమ్మ అలివేల బతుకమ్మ లక్ష్మీ నారమ్మ ఈదమ్మ చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.



