అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పికె శ్రీమతి, కనినిక బోస్ ఘోష్
తెలంగాణ నుంచి ఐదుగురికి ప్రాతినిధ్యం
కోశాధికారిగా తపసి ప్రహరాజ్
18 మంది ఉపాధ్యక్షులు, 10 మంది కార్యదర్శులు, ఐదుగురు సహాయ కార్యదర్శులు
109 మందితో కేంద్ర కమిటీ, ఐదుగురితో ప్యాట్రన్స్
జయప్రదంగా ముగిసిన అఖిలభారత మహాసభలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ 14వ మహాసభలు బుధవారం ముగిశాయి. హైదరాబాద్‌లోని ఆర్టీసీకళాభవన్‌లో నాలుగు రోజులపాటు ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. దేశ నలుమూలల నుంచి దాదాపు వెయ్యి మంది మహిళా ప్రతినిధులు హాజరయ్యారు. మహాసభల్లో మహిళల హక్కులు, ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళల పట్ల బీజేపీ అనుసరిస్తున్న అణచివేత చర్యలు, వేధింపులు, లైంగిక దాడులు, మహిళల పట్ల వివక్ష తదితరాంశాలపై మహాసభలో సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నో కీలకమైన తీర్మానాలను ఆమోదించారు. అమరుల త్యాగాల ను స్మరించుకున్నారు. వారి నుంచి ప్రతినిధులు స్ఫూర్తిని నింపుకున్నారు.
అనేక ఉద్యమ అనుభ వాలను పంచుకున్నారు. మహాసభలో భవిష్యత్తు కర్తవ్యాలను నిర్దేశించుకుని, తమ సొంత రాష్ట్రాల్లో సమరశంఖం పూరించేందుకు కార్యోన్ముఖులై తమ గమ్యస్థానాలకు బయలుదేరారు. జాతీయ మహాసభల్లో మొత్తం 109 మందితో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారితోపాటు 18 మందిని ఉపాధ్యక్షులుగా, పది మంది కార్యదర్శులను, ఐదుగురిని సహాయ కార్యదర్శులుగా మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఐద్వా జాతీయ కార్యదర్శిగా మల్లు లక్ష్మి, కేంద్ర కమిటీకి ఆర్ అరుణజ్యోతి, పాలడుగు ప్రభావతి, కేఎన్ ఆశాలత, బండి పద్మకు ప్రాతినిధ్యం దక్కింది.
ఉపాధ్యక్షులుగా..
సుభాషిణి అలీ, మరియం ధావలే, ఎస్. పుణ్యవతి, యు.వాసుకీ, సుధా సుందరరామన్, జహనారాఖాన్, కె.కె.శైలజ, సతీదేవి, సుసాన్ కోడి, టికే జైనాబా, కీర్తి సింగ్, రాంపరి, డెబోలినా హెంబ్రామ్, జగమతి సంగ్వాన్, మధు గార్గ్, బృందా దెబ్బర్మ, ప్రమీల, సలీఖా
కార్యదర్శులుగా..
కృష్ణ రక్షిత్, సీఎస్ సుజాత, ఎన్. సుకన్య, ఆశాశర్మ, ప్రాచి హతివ్లేకర్, టీఎన్ సీమా, మల్లు లక్ష్మి, మోనాలిసా సిన్హా, ఎ. రాధిక, స్వప్నా దత్తా. సహాయ కార్యదర్శులుగా దేవి, సవిత, అర్చనా ప్రసాద్, మైత్రీ మిశ్రా, వి. సావిత్రి
కేంద్ర కమిటీ సభ్యులు
వి.సావిత్రి, కె.శ్రీదేవి, వై.సత్యవతి, షేక్ మస్తాన్‌బీ, శ్యామల (ఆంధ్రప్రదేశ్), స్వర్ణలతదాస్, మైత్రీమిశ్రా, అనురిజాల్(అస్సాం), నీలం, బిందు కుమారి (బీహార్), ఆశాశర్మ, కవితా శర్మ, ఆశా యాదవ్, రెెండు ఖాళీలు (గుజరాత్), సవిత, ఉష సరోహ (హర్యానా), ఫాల్మా చౌహాన్, రంజనా జారెట్ (హిమాచల్‌ప్రదేశ్), సిబానీ పాల్, బీనాలిండా, మాయా లాయక్ (జార్ఖండ్), లతిఫా (జమ్మూ-కాశ్మీర్), దేవి, చంద్రకుమారి, సుశీల (కర్ణాటక), కె.కె. శైలజ, పి. కె. జైనాబా, పి. సతిదేవి, సుసాన్ కోడి, సుజాత సిఎస్, ఎన్. సుకన్య, కెఎస్ సాలీకా, న్యాయవాది ఎంజీ మీనాంబిక, న్యాయ వాది కె.పి. సుమతి, ప్రొఫెసర్ ఆర్. బిందు, న్యాయవాది పుష్పదాస్, ఈ. పద్మావతి, లతిక కె.కె, గీనాకుమారి, పి.కె. శ్యామల, (కేరళ), ప్రాచి హతి వ్లేకర్, నసీమా షేక్, రెహనా షేక్, సునీత షింగడ, రేఖ దేశ్‌పాండే (మహా రాష్ట్ర), ప్రీతిసింగ్, అంజన కురార్య, (మధ్యప్రదేశ్), ఆశాబాల (మణిపూర్),
సురాజిత నాయక్, సుశీల ముండ (ఒడిషా), ఇ. ఇళవరసి (పుదుచ్చేరి), డాక్టర్ కవల్జీత్ కౌర్, సుభాష్ మట్టు (పంజాబ్), సీమాజైన్, కమలా మేఫ్‌ు వాల్ (రాజస్థాన్), యు వాసుకీ, ఏ రాధికా, జి. ప్రమీల, ఎస్ వాలెంటినా, ఎస్.కె. పొన్నుతై, ఆర్. శశికళ, ఎస్. లక్ష్మి (తమిళనాడు), మల్లు లక్ష్మి, ఆర్. అరుణజ్యోతి, పాలడుగు ప్రభావతి, కెఎన్ ఆశాలత, బండి పద్మ (తెలంగాణ), కృష్ణ రక్షిత్, స్వప్న దత్త, ఝహర్ణ దాస్ బైడ్యి, రామణి దేబ్ బర్మా, దోషోరాణి త్రిపుర, జైస్మిన్ సుల్తానా, బిజేతనాథ్, బ్రిండాడెబ్బర్మ (త్రిపుర), సీమ కతియార్, వందనరారు, సుధాసింగ్ (ఉత్తరప్రదేశ్), డీఏ మయంత నెగి (ఉత్తరాఖండ్), జహానారా ఖాన్, డెబోలినాహెంబ్రామ్, రామాబిస్వాస్, సోమాదాస్, మణిథాపా, దీపుదాస్,అత్రేయ గుహ, మోనాలిసా సిన్హా, పరోమిటా సేన్. సిక్తా జోర్దార్, సుపర్ణ బెనర్జీ (పశ్చిమ బెంగాల్)
కేంద్రం
సుభాషిణీ అలీ, పి.కె. శ్రీమతి, మరియం ధావలే, ఎస్. పుణ్యవతి, సుధా సుందరరామన్, కీర్తిసింగ్, తపసి ప్రహరాజ్, మంజీత్ రాథీ, ఇషితా ముఖర్జీ, జగ్మతి సంగ్వాన్, అర్చనా ప్రసాద్, మధుగర్గ్, రాంపరి, కనినిక ఘోష్ బోస్, టి.ఎన్. సీమా, సంధ్య షైలీ, సర్బానీ సర్కార్, నీనా శర్మ,
ప్యాట్రన్స్
బృందాకరత్, రేఖ గోస్వామి, బనాని బిస్వాస్, మాలినీ భట్టాచార్య, రామదాస్.
తెలంగాణ నుంచి ఐదుగురికి చోటు
ఐద్వా నూతన జాతీయ కార్యవర్గంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఐదుగురు సభ్యులకు ప్రాతినిధ్యం లభించింది. జాతీయ కార్యదర్శిగా మల్లు లక్ష్మి, కేంద్ర కమిటీ సభ్యులుగా అరుణ జ్యోతి, ఆశాలత, ప్రభావతి, బండి పద్మ ఎన్నికయ్యారు.



