– ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా
– తెలంగాణ స్టార్
న్యూఢిల్లీ : తెలంగాణ బిడ్డ, భారత వర్థమాన ఫుట్‌బాల్ క్రీడాకారిణి గుగులోతు సౌమ్య ప్రతిష్టాత్మక ఏఐఎఫ్‌ఎఫ్ (ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్) వార్షిక అవార్డును సొంతం చేసుకుంది. 2025 మహిళల ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా గుగులోతు సౌమ్య నిలిచింది. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో సౌమ్య ఈ పురస్కారం అందుకుంది. 2013 నుంచి ఫుట్‌బాల్‌లో సత్తా చాటుతున్న సౌమ్య..జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ ప్రాతినిథ్యం వహించింది. భారత అండర్-14, 16, 17, 19 జట్ల తరఫున ప్రతిభ చాటుకున్న సౌమ్య.. 2019లో కెప్టెన్సీ బాధ్యతలు సైతం చేపట్టింది. జాతీయ జట్టు తరఫున అద్భుత ప్రదర్శనతో పాటు పలు క్లబ్‌ల తరఫున సౌమ్య ఆకట్టుకునే ప్రదర్శన చేసింది.
తెలంగాణకు గర్వకారణం
గుగులోతు సౌమ్య తెలంగాణకు గర్వకారణమని శాట్జ్ చైర్మెన్ కే. శివసేనా రెడ్డి అన్నారు. ఏఐఎఫ్‌ఎఫ్ ఉత్తమ మహిళా క్రీడాకారిణి అవార్డు అందుకున్న సౌమ్యను శివసేనా రెడ్డి అభినందించారు. ‘తెలంగాణలో ఫుట్‌బాల్‌కు ప్రభుత్వం గొప్ప సహకారం అందిస్తుంది. తెలంగాణ నుంచి ఏఐఎఫ్‌ఎఫ్ అవార్డు అందుకున్న తొలి మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్ సౌమ్య. సౌమ్య స్ఫూర్తితో మరింత మంది క్రీడాకారులు వెలుగులోకి వస్తారని ఆశిస్తున్నా’నని శివసేనా రెడ్డి అన్నారు.
సౌమ్యకు ఏఐఎఫ్‌ఎఫ్ వార్డు
- Advertisement -