Magazines

గ్రామీణ ఉపాధి హమీ పథకాన్ని పునరుద్ధరణ, 4లేబర్ కోడ్‌ల ఉపసంహరణ కోసం పోరాటంపై తీర్మానం

30 నిమిషాల క్రితం

AIKS MSP Resolution
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026 | 2 నిమిషాల చదవడం


- నవంబర్ 26న అఖిల భారత నిరసన కార్యాచరణలో పాల్గొనండి

నవతెలంగాణ నల్లగొండ:స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు (FTAs)వ్యతిరేకంగా, MSPదోపిడీని అరికట్టేందుకు, SIRరద్దు, MGNREGAపునరుద్ధరణ మరియు 4లేబర్ కోడ్‌ల ఉపసంహరణ కోసం పోరాటం

ప్రతిపాదన: హన్నన్ మొల్లా,బలపరిచినవారు:ఇ.పి.జయరాజన్

చారిత్రాత్మక రైతు పోరాటానికి 6వ వార్షికోత్సవం మరియు భారత రాజ్యాంగ దినోత్సవమైన నవంబర్ 26, 2026న దేశవ్యాప్తంగా ఐక్య పోరాటాలను ఉధృతం చేయాలని, భారీ నిరసన ప్రదర్శనల్లో పాల్గొనాలని అఖిల భారత కిసాన్ సభ (AIKS) 36వ జాతీయ మహాసభ దేశంలోని రైతులు,శ్రామిక ప్రజలకు పిలుపునిస్తోంది.

2020లో కార్పొరేట్ అనుకూల 3వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా లక్షలాది మంది రైతులు 385రోజుల పాటు సాగించిన పోరాటంలో 736మంది రైతులు అమరులయ్యారు. 2021డిసెంబర్ 9న కుదిరిన లిఖితపూర్వక ఒప్పందంలో MSPచట్టం చేస్తామని,ఇతర డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ మోదీ ప్రభుత్వం రైతులకు తీవ్ర ద్రోహం చేసింది.పైగా,స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (FTAs)రుద్దడం,ఉపాధి హామీ చట్టాన్ని (NREGA)రద్దు చేయడం, 4లేబర్ కోడ్‌లను ఏకపక్షంగా అమలు చేయడం మరియు ఓటర్ల జాబితా నుండి 13.4కోట్లకు పైగా ఓటర్లను తొలగించడం (SIR)వంటి దారుణమైన,నేరపూరిత చర్యలకు పాల్పడుతూ భారత రాజ్యాంగాన్ని బహిరంగంగా ఉల్లంఘిస్తోంది.

ఈ నేపథ్యంలో పోరాటాన్ని మరోసారి ఉధృతం చేసి భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా (SKM)పిలుపునిచ్చింది.అన్ని ప్రజా సంఘాలు,పౌర సమాజ ఉద్యమాల వేదిక అయిన 'పీపుల్ ఎగైనెస్ట్ SIR' (People Against SIR)రాజ్యాంగ దినోత్సవమైన నవంబర్ 26ను "ప్రజాస్వామ్యాన్ని తిరిగి పొందేందుకు మరియు జీవనోపాధిని రక్షించుకోవడానికి నిరసన తెలిపే ప్రజా హక్కుల దినోత్సవం" (People's Right Day)గా పాటించాలని పిలుపునిచ్చింది.రైతులు,కార్మికులు,వ్యవసాయ కూలీలు,ఆదివాసీలు,దళితులు,మైనారిటీలు,విద్యార్థులు,యువత మరియు మహిళలతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలతో కలిసి మరియు స్వతంత్రంగా దేశవ్యాప్తంగా భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించబడతాయి.

ఈ కీలక డిమాండ్ల సాధన కోసం పోరాట సందేశాన్ని గ్రామగ్రామాన తీసుకువెళ్లి,దేశవ్యాప్తంగా లక్షలాది మంది 'అన్నదాతలను'సమీకరించాలని AIKSతన అన్ని విభాగాలకు పిలుపునిస్తోంది.ప్రధాన డిమాండ్లు:

MSPదోపిడీని అరికట్టి,అన్ని పంటలకు కొనుగోలు హామీతో కూడిన C2+50%రేటును అందించే MSPచట్టాన్ని రూపొందించాలి.

సమగ్ర రుణమాఫీ చేయాలి మరియు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలన్నింటికీ రూ. 25లక్షల నష్టపరిహారం అందించాలి.

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (No FTA)వద్దు.

ఓటర్ల తొలగింపు ప్రక్రియ (No SIR)రద్దు చేయాలి.

ఉపాధి హామీ చట్టాన్ని (MGNREGA)పునరుద్ధరించాలి.

4లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి.

భారత రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కుపై దాడి చేస్తూ,పౌరులను అక్రమంగా గృహనిర్బంధంలో ఉంచడానికి పోలీసులను ఉపయోగిస్తూ,శాంతియుతంగా నిరసన తెలిపే చట్టబద్ధమైన హక్కును వినియోగించుకోకుండా అడ్డుకుంటూ మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు సవాలు విసురుతూ ఒక పోలీస్ రాజ్యాన్ని (Police State)అమలు చేస్తోంది.దేశ రాజధానిలో నిరసనల వేదికగా ఉన్న జంతర్ మంతర్‌ను డీ-నోటిఫై చేశారు.న్యూఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు,యువత,రైతులు,కార్మికులు,జర్నలిస్టులతో సహా అన్ని వర్గాలపై పోలీసులు మరియు బీజేపీ-ఆరెస్సెస్‌కు చెందిన అసాంఘిక శక్తులు క్రూరంగా దాడి చేశాయి.


ఇటువంటి అప్రకటిత ఎమర్జెన్సీని ప్రజలు,రైతాంగం ఏమాత్రం సహించబోరని 36వ మహాసభ మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తోంది. మోడీ-షా పాలనలో పెరుగుతున్న నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు,రాజ్యాంగ సంస్థలు,న్యాయవ్యవస్థ, అన్ని రాజకీయ పార్టీలు దృఢ సంకల్పంతో జోక్యం చేసుకోవాలని ఈ సదస్సు బలంగా డిమాండ్ చేస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్