నవతెలంగాణ- అశ్వరావుపేట: వామ పక్షాల పిలుపు మేరకు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం భద్రాద్రి కొత్త గూడెం జిల్లా, నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకేఎస్ అనుబంధ తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫాం రైతుసంఘం ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనలో జన్యు లోపంతో ఉన్న ఆయిల్ ఫామ్ మొక్క, గెలలు కార్మిక కర్షక శ్రేణులను ఆకర్శించింది.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న హాఫ్ (పూత కాత లేని) టైప్ మొక్కల విషయం, ప్రధానంగా భద్రాద్రి కొత్త గూడెం జిల్లా లో ఈ మొక్కలతో పెద్ద ఎత్తున రైతులు నష్ట పోయిన సంగతి విదితమే. దీన్ని ప్రతిబింబించే విధంగా హాఫ్ టైప్ మొక్క, గెలలతో ప్రదర్శన సమ్మెకారుల్లో ఆసక్తి రేపింది. దీనిపై భాదిత రైతులు, ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
సార్వత్రిక సమ్మెలో ఏఐకేఎస్ వినూత్న ప్రదర్శన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES