Wednesday, October 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవిప్లవ నిప్పు కణిక ఐలమ్మ : మంత్రి సీతక్క

విప్లవ నిప్పు కణిక ఐలమ్మ : మంత్రి సీతక్క

- Advertisement -

నవతెలంగాణ – ములుగు
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరవనిత చిట్యాల ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలో బుధవారం ఆమె చిత్ర పటానికి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ ధనసరి సీతక్క పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన చిట్యాల ఐలమ్మ తెలంగాణ పోరాట స్ఫూర్తికి నిదర్శనమని చెప్పారు. తొలి భూ పోరాటానికి నాంది పలికిన విప్లవ నిప్పు కణిక ఐలమ్మగా అభివర్ణించారు. భూమి కోసం, భుక్తి కోసం నిజాంపై తిరుగుబాటు చేశారన్నారు. ఐలమ్మ పోరాటాలను, త్యాగాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పని చేస్తున్నట్టు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -