వెల్లింగ్టన్ : మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ విమానయాన రంగంపై పడుతోంది. ఈ నేపథ్యంలో ఎయిర్ న్యూజిలాండ్ రాబోయే రెండు నెలల్లో 1,100 విమానాలను రద్దు చేయనున్నట్లు గురువారం ప్రకటించింది. సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిఖిల్ రవిశంకర్ తెలిపిన వివరాల ప్రకారం, సంస్థ మొత్తం విమానాల్లో దాదాపు ఐదు శాతం రద్దు చేయబడతాయి. ఈ నిర్ణయం వల్ల సుమారు 44,000 మంది ప్రయాణికులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
రద్దు చేయబడుతున్న విమానాలు ఎక్కువగా న్యూజిలాండ్‌లోని దేశీయ మార్గాల్లోనే ఉంటాయని, అయితే కొన్ని అంతర్జాతీయ విమానాలు కూడా ఇందులో ఉంటాయని ఆయన చెప్పారు. యూరప్‌కు ప్రత్యామ్నాయ మార్గాలకు డిమాండ్ పెరగడంతో న్యూజిలాండ్-అమెరికా మధ్య నడిచే విమానాలపై మాత్రం పెద్దగా ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేశారు. మధ్యప్రాచ్య ప్రాంతంలో పెరుగుతున్న ఘర్షణల కారణంగా జెట్ ఇంధన ధరల్లో తీవ్రమైన అస్థిరత నెలకొంది. సాధారణంగా బ్యారెల్‌కు 85 అమెరికన్ డాలర్లు ఉండే జెట్ ఇంధనం ధర ఇప్పుడు దాదాపు రెండింతలు పెరిగిందని రవిశంకర్ తెలిపారు.
పెరిగిన ఖర్చులను నియంత్రించేందుకు ప్రపంచ వ్యాప్తంగా విమానయాన సంస్థలు ఛార్జీలు మరియు షెడ్యూల్‌లను సర్దుబాటు చేస్తున్నాయని ఆయన చెప్పారు. ఇక మరోవైపు, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య చమురు ధరలు మరింత పెరుగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో ఇరాక్ జలాల్లో రెండు ఇంధన చమురు ట్యాంకర్లపై దాడి జరిగినట్లు భద్రతా అధికారులు వెల్లడించారు. పేలుడు పదార్థాలతో నిండిన పడవలు ఈ ట్యాంకర్లను ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనతో ప్రపంచ చమురు సరఫరాపై మరింత అనిశ్చితి నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరిగాయి. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు గ్లోబల్ ఇంధన మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
1,100 విమానాలను రద్దు చేయనున్న ఎయిర్ న్యూజిలాండ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



