Saturday, November 8, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీలో త‌గ్గ‌ని వాయు కాలుష్యం

ఢిల్లీలో త‌గ్గ‌ని వాయు కాలుష్యం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతూనే ఉంది. గాలి నాణ్యతలు మెరుగుపడడం లేదు. దీంతో ఆ రాష్ట్ర ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. చిన్నారులు శ్వాసకోశ సమస్యలతో అనారోగ్యానికి గురవుతున్నారు. శనివారం కూడా ఢిల్లీలో పేలవంగానే గాలి నాణ్యతలు నమోదయ్యాయి. ఢిల్లీలో ఈరోజు ఉదయం ఎక్యూఐ (ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌) 355గా నమోదైంది. ఎక్యూఐ స్థాయిలను వెరీ పూర్‌ కేటగిరీలో కేంద్ర కాలుష్య నియంత్రణా మండలి వర్గీకరించింది.

కాగా, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో.. ఆనంద్‌ విహార్‌లో ఏక్యూఐ 332గా, అలీపూర్‌ వద్ద 316, అశోక్‌ విహార్‌లో 332, ఇండియా గేట్‌ వద్ద 322గా, పాలెం ప్రాంతంలో 320, ధౌలా కువాన్‌లో 269, అశోక్‌ విహార్‌ ప్రాంతంలో 332, బవానాలో 366, బురారి క్రాసింగ్‌ వద్ద 345, ఛాందిని చౌక్‌ ప్రాంతంలో 354, ద్వారకా సెక్టార్‌-8లో 310, ఐటీఓ ప్రాంతంలో 337, జహంగీర్‌పురిలో 342, ముండ్కా ప్రాంతంలో 335, నరేలా వద్ద 335, ఓఖ్లా ఫేజ్‌-2లో 307, పట్పర్‌గంజ్‌ వద్ద 314, పంజాబీ బాగ్‌ 343, ఆర్‌కే పురంలో 321, రోహిణి ప్రాంతంలో 336, సోనియా విహార్‌ వద్ద 326గా ఏక్యూఐ వెరీ పూర్‌ కేటగిరీలో నమోదైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -