ఏక్యూఐ 386గా నమోదు
న్యూఢిల్లీ : ఢిల్లీలో గాలి నాణ్యతలు పడిపోయాయి. శనివారం ఉదయం 8 గంటలకు ఢిల్లీలో 386 వద్ద గాలి నాణ్యత సూచీ(ఏక్యూఐ) నమోదైంది. దీంతో ఈ స్థాయిల్ని ‘వెరీ పూర్’ క్యాటగిరీలో వర్గీకరించినట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలోనే గాలి నాణ్యతలు నమోదయ్యాయి. ఏక్యూఐ.. అశోక్ విహార్‌లో 415, బవానా 441, బౌరారి 383, సీఆర్‌ఆర్‌ఐ మథుర రోడ్ 365, చాందినీ చౌక్ 419, ద్వారకా సెక్టార్ 393, ఐటిఓ 418, జహంగిరిపురి 422, జేఎల్‌ఎన్ స్టేడియం 389, ముండ్కా 426, నజాఫ్‌గర్ 385, నరేలా 418, పట్పార్‌గంజ్ 399, పంజాబి బాగ్ 405, ఆర్‌కె పురం 406, రోహిణీ 424, సిరి కోట 495, సోనియా విహార్ 410, వివేక్ విహార్ 418, వజీర్‌పూర్ 447గా నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో వెరీ పూర్ క్యాటగిరీలో.. మరికొన్ని ప్రాంతాల్లో ప్రమాదకరస్థాయిలో ఏక్యూఐ నమోదైంది. ఇప్పటికే కాలుష్య నియంత్రణకు గ్రాప్ 2, గ్రాప్ -3 నిబంధనలు అమల్లో ఉన్నాయి.



