Saturday, March 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఐశ్వర్యా రజనీకాంత్‌ దర్శకత్వంలో 'టెక్స్లా'

ఐశ్వర్యా రజనీకాంత్‌ దర్శకత్వంలో ‘టెక్స్లా’

- Advertisement -

కన్నన్‌ రవి గ్రూప్‌ బ్యానర్‌పై కన్నన్‌ రవి నిర్మిస్తున్న ‘టెక్స్లా’ చిత్ర ప్రారంభ వేడుక చెన్నైలో శుక్రవారం ఘనంగా జరిగింది. ఐశ్వర్యా రజనీకాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జై, సురాజ్‌ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆనంద్‌ రాజ్‌, జి.ఎం. సుందర్‌, జార్జ్‌ మారియన్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. దీనికి సహ నిర్మాత దీపక్‌ రవి. శుక్రవారం జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు నామ్‌ తమిళర్‌ కచ్చి చీఫ్‌ కోఆర్డినేటర్‌ సీమన్‌, లతా రజనీకాంత్‌, నిర్మాత ఆర్‌.బి. చౌదరి, దర్శకుడు బాలా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నిర్మాత కన్నన్‌ రవి మాట్లాడుతూ, ‘ఇలాంటి వేదికపై మాట్లాడటం ఆనందంగా ఉంది.

తమిళనాడుకు చెందిన సూపర్‌ స్టార్‌ కుటుంబంతో కలిసి పని చేసే అవకాశం రావడం నాకు గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఐశ్వర్యా రజనీకాంత్‌ ఎంతో ప్రతిభావంతమైన దర్శకురాలు. సురాజ్‌ వెంజరమూడుతో కలిసి పని చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము గతంలో కొన్ని ప్రాజెక్టులు చేయాలని అనుకున్నా అవి కార్యరూపం దాల్చలేదు. ఇది ఒక దీర్ఘ ప్రయాణానికి ఆరంభం అని నమ్ముతున్నాను’ అని తెలిపారు. ‘మా చిత్ర ప్రయాణానికి ఇది మంచి ప్రారంభం. మాపై నమ్మకం ఉంచిన నిర్మాత కన్నన్‌ రవికి కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని విజయవంతం చేయడానికి మేమంతా పూర్తి నిబద్ధతతో పని చేస్తాం’ అని దర్శకురాలు ఐశ్వర్యా రజనీకాంత్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -