నవతెలంగాణ – వనపర్తి
ఏఎన్ఎంలకు ఎన్ సి డి ఆన్లైన్ ప్రోగ్రాం బాధ్యతలను తప్పించాలని ఏఐటియుసి నేతలు డిమాండ్ చేశారు. ఆన్లైన్ బాధ్యతలను ఏఎన్ఎం లకు అంటగట్టడంపై ఏఐటియుసి జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద సోమవారం ధర్నా చేసి నిరసన తెలిపారు. తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి ఏఐటియుసి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీహరి, మోష లు మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్సీడీ ప్రోగ్రాం ను ఆన్లైన్ లో ఎక్కించే పని కూడా ఏఎన్ఎం లతో చేయించడం దుర్మార్గమైన చర్య అని, ఈ చర్యను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇప్పటికే ఏఎన్ఎంలు అధిక పని భారంతో సతమతమవుతున్నారని, 14 రకాల మొబైల్ యాప్ ల ద్వారా అనేక రకాలైన స్క్రీనింగ్ టెస్టులు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఎన్సీడీ ప్రోగ్రాం ను ఆన్లైన్లో కూడా చేయించాలని ఒత్తిడి తేవడంతో తీవ్రమైన పని ఒత్తిడితో ఏఎన్ఎంలు అనేక రకాల రోగాలకు గురవుతున్నారన్నారు. కొంతమందికి బీపిలు షుగర్లు పెరుగుతున్నాయని, ఆరోగ్యం క్షిణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎం సి డి ప్రోగ్రాం ద్వారా 30 ఏళ్లకు పైబడిన వారందరినీ స్క్రీనింగ్ టెస్టులు చేసి అసంక్రమిత వ్యాధులను గుర్తించి నివారణ చర్యలు తీసుకునే విధంగా ఏఎన్ఎంలు కృషి చేస్తున్నారని తెలిపారు.
ఎన్ సి డి ప్రోగ్రాం ఆన్లైన్ కోసంఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డాటా ఆపరేటర్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఏఎన్ఎంలు అరకొరకగా ఉండటంతో అధిక పని ఏఎన్ఎంలపై పడిందని ఏఎన్ఎం లను రిక్రూట్మెంట్ చేయాలని. పోస్టులను పెంచాలని. ఏఎన్ఎం లందరికీ జీతాలు పెంచి పని ఒత్తిడి తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల ఆందోళన కార్యక్రమాన్ని ఉదృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరామ్. సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్. ఏఎన్ఎం యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కృష్ణవేణి. లక్ష్మి. ఏఎన్ఎం లు సుమిత్ర. లత. బాలేశ్వరమ్మ. వెంకటమ్మ. మాధవి. రాధిక. లలిత. అనురాధ. రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఏఎన్ఎంలకు ఎన్సిడి ఆన్లైన్ పనుల బాధ్యతను రద్దు చేయాలి : ఏఐటీయూసీ డిమాండ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES