Saturday, May 10, 2025
Homeతెలంగాణ రౌండప్మానవత్వం చాటుకున్న ఏకే ఫౌండేషన్ చైర్మన్

మానవత్వం చాటుకున్న ఏకే ఫౌండేషన్ చైర్మన్

- Advertisement -

గిరిజన దివ్యాంగురాలుకి వీల్ ఛైర్ అందజేసిన హైకోర్టు న్యాయవాది
నవతెలంగాణ – పెద్దవూర

నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం గట్టుమీదతండలో దివ్యాంగురాలైన అంగోతు సుశీల రెండు కర్రల సహాయంతో నడుస్తూ చాలా ఇబ్బంది పడేది. శుక్రవారం ఏకే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ తండాకి వెళ్ళి ఆమెను పరామర్శించారు. తన ఆరోగ్య పరిస్థితిని గూర్చి తెలుసుకుని, స్వయంగా అతని చేతుల మీదుగా దివ్యాంగురాలుకి వీల్ ఛైర్ అందజేశారు. ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఏకే ఫౌండేషన్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో విన్నుత్న కార్యక్రమాలు చేస్తోందని తెలిపారు. తండావాసులు ఆట పాటలతో స్వాగతం పలికి, ఎలాంటి పదవులు లేకున్నా.. నిరంతరం పేద ప్రజలకి సేవలు అందజేస్తున్న అనిల్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో అనిల్ నాయక్, హరి నాయక్, తిమ్మాపూరం మాజీ ఉప సర్పంచ్ తుమ్మరగోటి రమేష్,సాయి నాయక్, చందు నాయక్, సేవా నాయక్,  నరేష్ నాయక్, మన్నెం కోటి, రావుల రాము యాదవ్, మేకల శివ యాదవ్, గంగుల అంజి యాదవ్, శేఖర్ గౌడ్, పోలేపల్లి శివ, ప్రజా ప్రతినిధులు, మహిళ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు మరియు యువత తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -