Friday, February 27, 2026
E-PAPER
Homeజాతీయంఏకేజీ నా ప్రేరణ

ఏకేజీ నా ప్రేరణ

- Advertisement -

మోహన్‌ లాల్‌తో ఫేస్‌ టు ఫేస్‌ ఇంటర్వ్యూలో కేరళ సీఎం పినరయి విజయన్‌

తిరువనంతపురం: ఏకే గోపాలన్‌ (ఏకేజీ) తనకు ప్రేరణ అని కేరళ సీఎం పినరయి విజయన్‌ అన్నారు. నటుడు మోహన్‌ లాల్‌ నిర్వహించిన ‘ఇరువర్‌’ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీకి మాత్రమే భయపడుతున్నానని, దానికి తన అచంచల నిబద్ధతను పునరుద్ఘాటించారు. అనేక ఏండ్లుగా తనను నిరుత్సాహపరిచేందుకు కొందరు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, తాను స్థిరంగా ఉన్నానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. తనతో విభేదించే వారిపై తనకు ఎలాంటి ద్వేషం లేదని, తాను చెప్పేది ప్రజలు వింటారని నమ్ముతున్నానని అన్నారు. కొడియేరి బాలకృష్ణన్‌ గురించి.. మాట్లాడుతూ ”మనతో ఎక్కువ కాలం ఉండాల్సిన” నాయకులను ప్రారంభంలోనే కోల్పోవడం తనను తీవ్ర వేదనకు గురిచేసిందని సీఎం అన్నారు.

ముఖ్యంగా కొడియేరి బాలకృష్ణన్‌ మరణాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ నష్టాన్ని వ్యక్తిగతంగా బాధాకరమైనదిగా ఆయన అభివర్ణించారు. సినిమా గురించి మాట్లాడుతూ, మోహన్‌ లాల్‌ నటించిన ‘అమృతంగమయ’ మలయాళ సినిమాలో మరపురాని రచనలలో ఒకటిగా మిగిలిపోయిందని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అన్నారు. సినిమాల్లోని కొన్ని సన్నివేశాలు నిజ జీవితానికి అనుగుణంగా ఉంటాయని, యాక్షన్‌ సినిమాలు చూడటం తనకు చాలా ఇష్టమని తెలిపారు. ఈ వారం ప్రారంభంలో విడుదలైన ‘ఇరువర్‌’ టీజర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ”ప్రజలచే ప్రేమించబడిన ఇద్దరు వ్యక్తులు, ప్రజలను ప్రేమించేవారు” అనే ట్యాగ్‌లైన్‌తో కూడిన ఈ ప్రివ్యూకు ప్రేక్షకుల నుంచి విస్తృత ప్రశంసలు లభించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -