Monday, June 2, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్అక్కినేని ఇంటా మ‌రోసారి పెళ్లిబాజాలు..

అక్కినేని ఇంటా మ‌రోసారి పెళ్లిబాజాలు..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీల‌లో ఒక‌టైన అక్కినేని ఇంటా మ‌రోసారి పెళ్లిబాజాలు మోగ‌నున్నాయి. గ‌తేడాది నాగార్జున పెద్ద కొడుకు న‌టుడు నాగ‌చైత‌న్య – శోభితా పెళ్లి జ‌రుగ‌గా.. తాజాగా అత‌డి చిన్న కొడుకు అఖిల్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు. ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్‌డ్జీ కుమార్తె జైనబ్‌తో అఖిల్ నిశ్చితార్థం చేసుకున్న విష‌యం తెలిసిందే. గత ఏడాది నవంబర్ 26న వీరి నిశ్చితార్థం జరగ‌గా.. జూన్ 6న పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలావుంటే తాజాగా అఖిల్ వెడ్డింగ్ కార్డుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంద‌జేశాడు నాగార్జున.

శ‌నివారం ఉద‌యం ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన నాగార్జున, అమల దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంత‌రం అఖిల్ వివాహ శుభలేఖను ఆయనకు అందించారు. ఈ సందర్భంగా నాగార్జున దంపతులు సీఎం రేవంత్ రెడ్డితో కాసేపు ముచ్చటించారు. అఖిల్ వివాహ ఏర్పాట్లు, సినీ విశేషాలపై సంభాషించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగార్జున దంపతులను ఆప్యాయంగా పలకరించి, అఖిల్‌కు పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

అక్కినేని కుటుంబం నుండి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అఖిల్ ‘సిసింద్రీ’ (1994) చిత్రంతో బాలనటుడిగా వెండితెరపై కనిపించారు. ఆ తర్వాత ‘అఖిల్’ (2015) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్‌ వంటి చిత్రాల్లో న‌టించిన కూడా ఇప్ప‌టివ‌ర‌కు కెరీర్‌లో ఒక్క హిట్టు కూడా న‌మోదు చేయ‌లేదు ఈ కుర్ర హీరో. ప్రస్తుతం అఖిల్ ‘లెనిన్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తుండగా, శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -