Wednesday, April 22, 2026
E-PAPER
Homeజాతీయంభారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..

భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా భారతదేశంలో మరోసారి వాణిజ్య గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. దేశంలో వంటగ్యాస్ కొరత తీవ్రతరం కావడంతో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరను ఒక్కో సిలిండర్‌కు రూ.195.50 పెంచారు. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు మరియు చిన్న వ్యాపారాలపై గణనీయమైన భారం పడనుంది. నెల రోజుల క్రితం (మార్చి 1న) సిలిండర్ పై రూ.114.5 పెంచిన విషయం విదితమే. కాగా గృహ అవసరాల కోసం వాడే వంటగ్యాస్ ధరలో ఎలాంటి మార్పు లేదు.

ఇదే సమయంలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్) లేదా జెట్ ఇంధన ధరలు కూడా రికార్డు స్థాయికి చేరాయి. బుధవారం నాటికి ఎటిఎఫ్ ధరలు రెండింతలకు పైగా పెరిగి, కిలోలీటరుకు ₹2.07 లక్షలకు చేరాయి. ఢిల్లీలో ఎటిఎఫ్ ధర ₹1,10,703.08 పెరిగి, మొత్తం ₹2,07,341.22కు చేరినట్లు ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లు వెల్లడించారు.

ఎటిఎఫ్ ధరలు కిలోలీటరుకు ₹2 లక్షల మార్క్‌ను దాటడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. గతంలో రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల సమయంలో చమురు ధరలు పెరిగి 2022లో సుమారు ₹1.1 లక్షల వరకు చేరిన గరిష్ఠ స్థాయిని నమోదు చేశాయి. ఈ పెరుగుదల ప్రభావం విమాన ప్రయాణ ఖర్చులు మాత్రమే కాకుండా, వాణిజ్య కార్యకలాపాలు మరియు సాధారణ వినియోగదారులపై కూడా పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -