Wednesday, April 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం...

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని పట్టణాలు, నగరాల్లో పింఛన్ల పంపిణీకి సంబంధించిన రూల్స్ మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఫేషియల్‌ రికగ్నేషన్‌ (ముఖ ఆధారిత గుర్తింపు) విధానంలో పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రజాభవన్‌లో మున్సిపల్‌శాఖ అధికారులకు శిక్షణ కూడా ఇచ్చారు. పింఛన్ల పంపిణీకి సంబంధించి ఫేషియల్‌ రికగ్నిషన్‌ విధానంపై జిల్లా సమన్వయకర్తలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, వార్డు అధికారులకు శిక్షణ ఇచ్చారు.ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ముఖగుర్తింపుతో పెన్షన్లు ఇస్తున్నామని మెప్మా (పట్టణ ప్రాంతాల పేదరిక నిర్మూలన సంస్థ) సీఈవో దివ్యాదేవరాజన్‌ గుర్తు చేశారు. ఇకపై నగరాలు, పట్టణ ప్రాంతాల్లోనూ త్వరలో ఫేస్ రికగ్నేషన్‌ విధానాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కొత్త విధానంతో.. ఒకవేళ ఎవరైనా అనర్హులు, చనిపోయిన వారి పేర్లు ఉంటే.. వాటిని తొలగించి అర్హులకే పింఛన్లు అందజేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందిన అధికారులు వారి, వారి జిల్లాలలో అక్కడి సిబ్బందికి శిక్షణ ఇస్తారన్నారు. అనంతరం ఈ కొత్త విధానాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -