నవతెలంగాణ-హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నిమిత్తం ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో తెలంగాణ హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. ఈ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా అప్పటి ప్రభుత్వ పెద్దలు మరియు సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై మాజీ మంత్రి హారీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు.
అంతిమంగా ధర్మం గెలిచిందన్నారు. న్యాయసూత్రాలకు విరుద్దంగా కమిషన్‌ను ఏర్పాటు చేశారని, వ్యక్తిగతంగా భంగం కలిగించేందుకు ఎన్నో కుట్రలు చేశారని, ప్రజా సమస్యలు పక్కనబెట్టి డ్రామా సృష్టించిన రేవంత్‌రెడ్డి నిజస్వరూపం బయటపడిందన్నారు. ఇప్పటికైనా కక్షసాధింపులు, రాజకీయ దుష్ప్రచారం మానేసి వెంటనే రెండు పిల్లర్ల మరమ్మత్తులు పూర్తి చేయలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు.



