- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన సి అఖిల్ 27వ తేదీన జరిగిన ఉమ్మడి జిల్లా ఖోఖో పోటీల్లో ప్రతిభ కనపరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్టు ప్రాధనోపాధ్యాయులు దొంతుల రవీందర్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులు 30, 31,1 తేదీల్లో వికారాబాద్ లో జరిగే పోటీలలో పాల్గొన్నట్టు వ్యాయమ ఉపాధ్యాయుడు భాజం రాజేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారుని పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు.
- Advertisement -



