- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
లంబాడి హక్కుల పోరాట సమితి భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షునిగా హాట్కార్ అక్కిరామ్ నాయక్, అజ్మీర సమ్మయ్య నాయక్ మండల అధ్యక్షునిగా నియామక పత్రాలను రాష్ట్ర అధ్యక్షులు అజ్మీరా పూల్ సింగ్ నాయక్ ఆదివారం అందించారు. మండలంలోని ఆడువాలపల్లి గ్రామానికి చెందిన అక్కిరామ్ సంవత్సరాలుగా లంబాడ హక్కుల పోరాట సమితి ఉద్యమంలో జాతి కోసం నిరంతరం కృషి చేస్తూ ఎన్నో పోరాటాలలో పాల్గొన్నారని తెలిపారు. తనపై నమ్మకంతో జిల్లా ఉపాధ్యక్షుడుగా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా పూల్ సింగ్ నాయక్ కు,జిల్లా అధ్యక్షుడు ముకులోత్ శ్రీనివాస్ కు,జాతీయ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -