- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
కోజాగరి పౌర్ణమి సందర్భంగా శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం లో మంగళవారం అమ్మవారికి కుంకుమ పూజ, పంచామృత అభిషేకం, చండీ హోమం మహా నివేదన, నీరాజనం, మంత్రపుష్పం ప్రసాద వితరణ ప్రత్యేక పూజలను మున్సిపల్ మాజీ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, దేవాలయ మాజీ చైర్మన్ పూదరి లక్ష్మీనారాయణ గౌడ్, పూదరి చంద్రమౌళి గౌడ్, పూదరి శ్రీనివాస్ , దేవాలయ అర్చకులు తాటికొండ పరమేశ్వర్ శర్మ, శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం అర్చకులు తాటికొండ వినయ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -