Monday, February 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆకుల యాదగిరి కుటుంబ సభ్యుల ఆందోళన 

ఆకుల యాదగిరి కుటుంబ సభ్యుల ఆందోళన 

- Advertisement -

నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం  : ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి కుటుంబ సభ్యులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన దిగారు. ముందుగా కాంగ్రెస్ ఎనిమిది మంది కౌన్సిలర్లతో పాటు స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి బీజేపీ కౌన్సిలర్ తో కలిసి సమావేశం మందిరానికి ముందుగా చేరుకున్నారు. సుమారు అరగంట ఆలస్యంగా ప్రత్యేక వాహనంలో 12 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఒకటో వార్డు బీజేపీ కౌన్సిలర్ తో మంది సమావేశం మందిరంలోకి చేరుకున్నారు. వీరిలో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి లేకపోవడంతో ఆయన సతీమణి ఆకుల వసంత, కుమారుడు టోనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఒకసారి ఆందోళన దిగారు.

బీఆర్ఎస్ కౌన్సిలర్లు సమావేశం మందిరంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. “మా ఆయన ఎక్కడ” అంటూ నిలదీశారు. సీనియర్ కౌన్సిలర్ గా ఆయన్ను సమావేశానికి రాకుండా అడ్డుకోవడం ఆందోళన కలిగిస్తుందని మండిపడ్డారు. టేకుల సుదర్శన్ రెడ్డికి కౌన్సిలర్లు అమ్ముడుపోయారని, అందుకే మా ఆయనను చైర్మన్ కాకుండా బీఆర్ఎస్ అడ్డుకుందని ఆరోపించారు. దాంతో పోలీసులు వారిని పక్కకు నెట్టివేశారు. ఇదిలా ఉంటే స్వతంత్ర అభ్యర్థి దాసరి మురళి కృష్ణ సమావేశ మందిరానికి ఒంటరిగా చేరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. సమావేశం మందిలోకి వెళ్తుండగా అడ్డుకొని ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కు ఓటు వేయవద్దని, కాంగ్రెస్ కి ఓటు వేయాలని కొడుకు మురళి కృష్ణకు సూచించారు. దాంతో మున్సిపల్ కేంద్రం వద్ద ఆందోళన పరిస్థితులు ఏర్పడ్డాయి.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -