నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఆన్ సాన్ పల్లి గ్రామానికి చెందిన ప్రముఖ భరతనాట్య వర్ధమాన నృత్య కళాకారిణి బానోత్ అలకనంద గత మూడు సంవత్సరాలనుండి ఎన్నో వేదికలపై తన భరతనాట్య నృత్య ప్రదర్శనను ప్రదర్శించి ప్రముఖుల చేతుల మీదుగా సుమారు వివిధ రకాల 20 జాతీయ,అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. అలకనంద గత వేదికలపై ఇచ్చినటువంటి అద్భుతమైన నృత్య ప్రదర్శనలను పరిశీలించిన అనంతరం ప్రముఖ రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ అప్ రికార్డ్స్, 21ఫస్ట్ సెంట్రీ ఇంటర్నేషనల్ బుక్ అప్ రికార్డ్స్ సంస్థల ఇండియా చీఫ్ కో-ఆర్డినేటర్ ఎం.హారిక, తెలంగాణ రాష్ట్ర చీఫ్ కో-ఆర్డినేటర్ ఇసనపల్లి నగేష్ లు అలకనంద భరత నాట్యంలో వారల్డ్ రికార్డు చేయుటకు ఎంపిక చేస్తూ ఎంపిక నియామక పత్రం అందచేసినట్లుగా తెలిపారు.చిన్నారి అలకనంద భూపాలపల్లి పట్టణం బాలాజీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ లో 7వ తరగతి చదువుతూ భరతనాట్యంలో ఏకలవ్య శిష్యురాలిగా రానిస్తున్నందుకు, వారల్డ్ రికార్డు కు ఎంపికపట్ల గ్రామస్థులు, స్నేహితులు, తల్లిదండ్రులు, బాలాజీ స్కూల్ యాజమాన్యం ఆనందం వ్యక్తం చేశారు.
వరల్డ్ రికార్డ్ కు అలకనంద…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES