నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని చౌట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల్లో జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాన్ని జిల్లా ఎం సి హెచ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుప్రియ సోమవారం తనిఖీ చేశారు. పలు పాఠశాలలను, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన ఆమె విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు ఇస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల11వ తేదీ ఒకటి నుండి 19 సంవత్సరాలు పిల్లలందరికీ నులి పురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.ఆల్బెండజోల్ మాత్రలను పిల్లలకు వేయడం ద్వారా నులిపురుగుల నివారణ జరుగుతుందని, తద్వారా పిల్లల్లో రక్తహీనత తగ్గుతుందన్నారు.
తద్వారా పిల్లల్లో చురుకుదనము, చదువులో ముందంజ, ఇతర కార్యక్రమాల్లో పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఒకటి నుండి రెండు సంవత్సరాల్లో పిల్లలకు సగం సగం మాత్రమే, రెండు పైబడిన వాళ్లకు ఒక మాత్ర చొప్పున వారు అన్నం తిన్న తర్వాత వేయాల్సి ఉంటుందన్నారు. చిన్న పిల్లలకు మాత్రను నలిపి స్పూను ద్వారా నీటితో అందిస్తారని, పెద్ద పిల్లలు మాత్రను నమిలి చప్పరించు మింగాలని తెలిపారు.ఆరోజు హాజరు కాని విద్యార్థులకు ఈనెల 18న మాత్రలను వేయడం జరుగుతుందని డాక్టర్ స్పందన తెలిపారు. తల్లిదండ్రులు సహకరించి తమ పిల్లలకు తప్పనిసరిగా ఆల్బెండజల్ మాత్రలు వేయించాలని, తద్వారా నులిపురుల నివారణ దినోత్సవ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు తోడ్పాటు అందించాలని కోరారు.కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ స్పందన, ఆరోగ్య విస్తరణ అధికారి సత్యనారాయణ, సూపర్వైజర్ స్వరూప, సిబ్బంది, ఆశా కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ పరిశీలన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES