Thursday, January 22, 2026
E-PAPER
Homeఆటలుమూడోరౌండ్‌కు అల్కరాజ్‌, జ్వెరేవ్‌

మూడోరౌండ్‌కు అల్కరాజ్‌, జ్వెరేవ్‌

- Advertisement -

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో టాప్‌సీడ్‌, స్పెయిన్‌ యువ సంచలనం కార్లోస్‌ అల్కరాజ్‌ జోరు కొనసాగుతుంది. బుధవారం జరిగిన 2వ రౌండ్‌ పోటీలో అల్కరాజ్‌ వరుససెట్లలో జర్మనీకి చెందిన వాన్‌ప్యాన్‌ను ఓడించి మూడోరౌండ్‌కు చేరాడు. రెండోరౌండ్‌లో అల్కరాజ్‌ 7-6(7-4), 6-3, 6-2తో వాన్‌ఫ్యాన్‌ను చిత్తుచేశాడు. ఇక 3వ సీడ్‌, జర్మనీకి చెందిన జ్వెరేవ్‌ 6-3, 4-6, 6-3, 6-4తో ముల్లర్‌(ఫ్రాన్స్‌)ను, 10వ సీడ్‌ బబ్లిక్‌(కజకిస్తాన్‌) 7-5, 6-4, 7-5తో అన్‌సీడెడ్‌, హంగేరికి చెందిన మార్టన్‌ ఫుక్సోవిక్స్‌ను చిత్తుచేశాడు. ఇక 11వ సీడ్‌, రష్యాకు చెందిన మెద్వదెవ్‌ 6-7(9-11), 6-3, 6-4, 6-2తో క్యూ-హీలెన్‌(ఫ్రాన్స్‌)పై, 13వ సీడ్‌ రుబ్లేవ్‌(రష్యా) 6-4, 6-3, 4-6, 7-5తో పారియా(పోర్చుగల్‌), 19వ సీడ్‌ టామీ పాల్‌(అమెరికా) 6-3, 6-4, 6-2తో అర్జెంటీనాకు చెందిన టెరాంటోను ఓడించి మూడోరౌండ్‌కు చేరారు.

సబలెంకా, గాఫ్‌ జోరు
మహిళల సింగిల్స్‌లో అమెరికా సంచలనం కోకా గాఫ్‌, టాప్‌సీడ్‌ అర్యానా సబలెంకాల జోరు కొనసాగుతోంది. రెండోరౌండ్‌లో సబలెంకా(బెలారస్‌) 6-3, 6-1తో చైనాకు చెందిన అన్‌సీడెడ్‌ ట్రైను చిత్తుచేయగా.. కోకా గాఫ్‌ 6-2, 6-2తో సెర్బియాకు చెందిన ఓల్గా డానిలోవిచ్‌ను చిత్తుచేసింది. ఇక ఆండ్రీవా(రష్యా) 6-0, 6-4తో గ్రీక్‌కు చెందిన సక్కారి, 19వ సీడ్‌, చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన ముఛోవా 4-6, 6-4, 6-4తో పార్క్స్‌(అమెరికా)ను చిత్తుచేయగా.. 28వ సీడ్‌ రాడుకాను(బ్రిటన్‌) 6-7(3-7), 2-6తో అన్‌సీడెడ్‌ పోటాపోవా(ఆస్ట్రియా) చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఇక 17వ సీడ్‌ విక్టోరియా ఎంబోకో(కెనడా), 7వ సీడ్‌ పోలిని(ఇటలీ), 14వ సీడ్‌ టాసన్‌(డెన్మార్క్‌)ను ఓడించి మూడోరౌండ్‌కు చేరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -