నవతెలంగాణ-  ఆర్మూర్ 
మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ శ్రీ లక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి (భైరవ గుట్ట) విగ్రహ పున ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా బుధవారం నుండి శుక్రవారం వరకు మద్యం, మాంసాహారం క్రియ విక్రయాలు బందు పాటించనున్నారు. సుమారుగా మూడున్నర ఎకరాల సువిశాల స్థలంలో వెంకటేశ్వర మందిరంతో పాటు నవగ్రహ ఆలయం, శివాలయం సైతం నిర్మించినారు. హైదరాబాద్ కు చెందిన మదనానంద సరస్వతి పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి, నందిపేట కేదరీశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు బాలయోగి మంగిరాములు మహారాజు, తదితర వేద పండితుల మంత్రోచ్ఛారణాల మధ్య విగ్రహాలను పున ప్రతిష్టన్నారు. కార్తీక మాస శుభ పర్వదినాన విగ్రహ పున ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా గ్రామ అభివృద్ధి కమిటీ తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేయగా.. ఆలయానికి వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినట్టు వీడీసీ అధ్యక్షులు నవ భోజరాజు, కోశాధికారి నచ్చు గంగాధర్ లు తెలిపారు.
మూడు రోజులు మద్యం.. మాంసాహారం బంద్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



