బీజేపీ అధ్యక్షులు రాంచందర్‌రావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత ఆలే నరేంద్ర తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాటం చేశారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు గుర్తు చేశారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆలే నరేంద్ర వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి రామచందర్‌రావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ పెట్టి ఆలే నరేంద్ర ఉద్యమం చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో అరాచక శక్తులను ఎదరించి పోరాటం చేశారని తెలిపారు. పేదలకు అండగా నిలబడ్డారని చెప్పారు. మతకల్లోలాల సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు భరోసా కల్పించారని గుర్తు చేశారు. మతోన్మాద శక్తుల ఆటలు కట్టించడంలో ఆయన ముందు ఉండేవారని పేర్కొన్నారు.
ఆలే నరేంద్ర తెలంగాణఆత్మగౌరవం కోసం పోరాడారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



