- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో యాదిగిరిగుట్ట ఒకటి. ఈ ఆలయానికి రోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత.. భక్తుల తాకిడి భారీ స్థాయిలో పెరిగింది. తాజాగా యాదాద్రికి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు కీలక సూచనలు చేశారు. ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం టికెట్ ధరలు పెంచారు. ఇప్పటివరకు రూ.800 ఉన్న సత్యనారాయణ స్వామి వ్రతం టికెట్ ధరను రూ.1000కి పెంచారు. ఈ మేరకు శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
- Advertisement -