- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు ముందస్తు జాగ్రత్తగా తమ సమీప పోలీస్ స్టేషన్ లేదా బీట్ ఆఫీసర్‌కు సమాచారం అందించాలని హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ కోరారు. ఇలా సమాచారం ఇవ్వడం వల్ల పోలీసులు తమ రెగ్యులర్ పెట్రోలింగ్‌లో ఆయా ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతారని, తద్వారా నేరాల నియంత్రణలో ప్రజల సహకారం కీలకమని ఆయన తెలిపారు.
- Advertisement -



