దాడులు నిర్వహించిన ఈగల్ టీం
నవతెలంగాణ-సిటీబ్యూరో
మూతపడిన పాఠశాలలో డ్రగ్స్ తయారీ హైదరాబాద్‌లో సంచలనం రేపింది. బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మూతపడిన పాఠశాలలో అల్ఫాజోలం తయారు చేస్తున్నట్టు సమాచారం అందుకున్న ఈగల్ టీం శనివారం దాడులు నిర్వహించింది. గుట్టుచప్పుడు కాకుండా మూతపడిన పాఠశాలను అడ్డాగా చేసుకున్న సికింద్రాబాద్‌లోని ఓల్డ్‌బోయిన్‌పల్లి సాయి కాలనీకి చెందిన ఏం. జయప్రకాష్ గౌడ్ అనే వ్యాపారి అల్ఫాజోలం తయారు చేస్తున్నాడు. హన్‌పర్తికి చెందిన జి.మురళీ సాయి, పి.ఉదరుతో కలిసి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా మూతపడిన పాఠశాలలోనే అక్రమంగా మత్తు పదార్థాలను తయారు చేస్తున్నట్టు ఈగల్ టీం గుర్తిం చింది. ఈ మేరకు శనివారం పాఠశాలపై దాడులు నిర్వహించిన ఈగల్ టీం సభ్యులు అల్ఫాజోలం తయారు చేసే యంత్రాలను, ముడి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.