Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeఆటలుఅల్కరాస్‌, సినర్‌ సై

అల్కరాస్‌, సినర్‌ సై

- Advertisement -

సిన్సినాటి ఓపెన్‌ ఫైనల్లో ఢకిీ రంగం సిద్ధం
సెమీస్‌లో టాప్‌ అథ్లెట్ల అలవోక విజయాలు

ప్రపంచ టెన్నిస్‌ను మరో ఇద్దరు అగ్రశేణి క్రీడాకారులు ఆసక్తికరంగా మార్చుతున్నారు. ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌ టైటిల్‌ పోరులో మహా పోరుతో అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠ అనుభూతిని అందించిన కార్లోస్‌ అల్కరాస్‌, జానిక్‌ సినర్‌లు తాజాగా సిన్సినాటి ఓపెన్‌లోనూ టైటిల్‌ పోరుకు సిద్ధమయ్యారు. పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో అలవోక విజయాలు సాధించిన అల్కరాస్‌, సినర్‌లు ముచ్చటగా మూడోసారి అంతిమ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నారు.
సిన్సినాటి (యుఎస్‌ఏ)
వరల్డ్‌ నం.1 జానిక్‌ సినర్‌ (ఇటలీ), వరల్డ్‌ నం.2 కార్లోస్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌) మరో మహాపోరుకు సిద్ధమయ్యారు. మరో పది రోజుల్లో యు.ఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ రేసులో తాడోపేడో తేల్చుకోనున్న సినర్‌, అల్కరాస్‌.. అంతకుముందు సిన్సినాటి ఓపెన్‌లో సమరానికి సై అంటున్నారు. పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ పోరులో సినర్‌, అల్కరాస్‌ పోటీపడుతున్నారు. ఆదివారం జరిగిన మెన్స్‌ సింగిల్స్‌ సెమీఫైనల్స్‌లో జానిక్‌ సినర్‌, కార్లోస్‌ అల్కరాస్‌ అలవోక విజయాలు సాధించారు. మరోవైపు మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌లో ఎలెనా రిబకినా (రష్యా), ఇగా స్వైటెక్‌ (పొలాండ్‌).. వెరోనికా (రష్యా), జాస్మిన్‌ పావొలిని (ఇటలీ) ఫైనల్లో చోటు కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు.
అలవోక విజయాలతో..
పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో వరల్డ్‌ నం.1, టాప్‌ సీడ్‌ జానిక్‌ సినర్‌ (ఇటలీ) వరుస సెట్లలో అలవోక విజయం సాధించాడు. 7-6(7-4), 6-2తో అన్‌సీడెడ్‌ ఫ్రాన్స్‌ ఆటగాడు, క్వాలిఫయర్స్‌ నుంచి సెమీస్‌కు చేరుకున్న టెరెన్స్‌ అట్మానెపై సినర్‌ గెలుపొందాడు. వింబుల్డన్‌ చాంపియన్‌కు తొలి సెట్లో టెరెన్స్‌ గట్టి పోటీ ఇచ్చాడు. క్వాలిఫయర్స్‌ నుంచి వచ్చిన టెరెన్స్‌ దూకుడుతో తొలి సెట్‌ టైబ్రేకర్‌కు వెళ్లింది. టైబ్రేకర్‌లో 7-4తో పైచేయి సాధించిన సినర్‌.. అదే జోరు రెండో సెట్లోనూ కొనసాగించాడు. 6-2తో అలవోకగా విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్నాడు. ఆరు ఏస్‌లు, రెండు బ్రేక్‌ పాయింట్లతో మెరిసిన సినర్‌ పాయింట్ల పరంగా.. 68-50తో పైచేయి సాధించాడు. 9 ఏస్‌లు కొట్టిన టెరెన్స్‌.. ఒక్క బ్రేక్‌ పాయింట్‌ కూడా సాధించలేదు.
తొలి సెట్లో ఆరు సార్లు సర్వ్‌ నిలుపుకున్న టెరెన్స్‌ రెండో సెట్లో తేలిపోయాడు. రెండో సెట్లో రెండు సార్లు టెరెన్స్‌ సర్వ్‌ బ్రేక్‌ చేయటంతో పాటు తన సర్వ్‌లో వరుస గేములు గెలుపొందిన సినర్‌ తనదైన జోరు చూపించాడు. మెన్స్‌ సింగిల్స్‌ మరో సెమీఫైనల్లో వరల్డ్‌ నం.2 కార్లోస్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌) 6-4, 6-3తో వరల్డ్‌ నం.3 అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)పై గెలుపొందాడు. కెరీర్‌ భీకర ఫామ్‌లో ఉన్న అల్కరాస్‌ వరుస సెట్లలోనే లాంఛనం ముగించాడు. మూడు ఏస్‌లు, ఓ బ్రేక్‌ పాయింట్‌తో జ్వెరెవ్‌ రాణించగా.. 11 ఏస్‌లు, 4 బ్రేక్‌ పాయింట్లతో అల్కరాస్‌ మెరిశాడు. పాయింట్ల పరంగా 66-46తో అల్కరాస్‌ ఆధిపత్యం చూపించాడు. ఓవరాల్‌గా అల్కరాస్‌ 12 గేమ్‌లు గెలుపొందగా.. జ్వెరెవ్‌ ఏడు గేమ్‌లు నెగ్గాడు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad