నవతెలంగాణ – భువనగిరి
భువనగిరిలో నిర్వహించే 7 ప్రదేశాలలో దసర ఉత్సవాలలో ఘనంగా నిర్వహిస్తారని అక్కడ అన్ని ఏర్పాట్లు చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖ అధికారులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. సద్దుల బతుకుమ్మ సందర్భంగా పెద్ద చెరువులో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్ వద్ద లైటింగ్, శానిటేషన్, ఇతర సౌకర్యాలు కల్పించాలని దేశించారు.
దసర పండుగ రోజులు విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాంతడక, హన్మాన్‌వాడ, అంజనాద్రి ఆలయం, సాయిబాబా గుడి, హుసెనాబాద్‌తో పాటు, వివిధ ఏరియాలో దసర ఉత్సవాలు నిర్వహిస్తారి ఏర్పాటు పకడ్బందిగా చేయాలని సూచించారు. అనంతరం భువనగిరి పట్టణం జగ్దేవ్ పూర్ రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పరిశీలించారు. జగదేవ్‌పూర్ చౌరస్తా నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు తిరిగి పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి విలేకర్లుతో మాట్లాడారు. ఈ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్నాయని ఎక్కువ వర్షాలు పడి గుంతలు ఏర్పడి ప్రణాలు పొతున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 60 పిట్లు రోడ్డు చేయ్యడంతో పాటు, నాలుగు వందల మిటర్లు వరకు రోడ్డు విస్తరణ చేస్తామన్నారు. మొదటగా 200 మిటర్లు పనులు పూర్తి అయిన తరువాత అక్కడి నుంచి రైల్వే పై వర్ బిడ్జీ వరకు చేయనున్నట్లు తెలిపారు.
రోడ్డు వెంబడి ఆక్రమించి ఉన్న షాప్ లు తీసేయాలని, జీవనోపాది కోల్పోకుండా అంతకు ముందు నిర్మించి ఉన్న షాప్ లు అలానే ఉంటాయన్నారు. ప్రధానంగా ప్రమాదాలు, ట్రాఫిక్ జాం ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ ప్రాంతం అంతా రోడ్డు విస్తరణ జరిగిందన్నారు. రెండు వందల మిటర్లు వరకు కాంక్రీటింగ్, బీటీతో పాటు, రోడ్డుకు ఇరువైపులా డ్రెయిన్, గ్రిల్స్, ఫుట్ పాత్ ఏర్పాటుచేసి ఇబ్బందులు కలగకుండా అధునాతనంగా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, మున్సిపల్ కమీషనర్ రామలింగం, మున్సిపల్ డిఈ కొండల్‌రావు, ఇతర అధికారులు పాల్గోన్నారు.