నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పాల్వంచ మండలంలోని పిడబ్ల్యుడి రోడ్డు నుండి మంథని దేవునిపల్లి వరకు గల రోడ్డుకు జరుగుతున్న మరమత్తు పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వరదల ప్రభావంతో దెబ్బతిన్న రహదారులను త్వరగా మరమ్మత్తులు చేసి పునరుద్ధరించి ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ప్రజా రవాణాకి ఇబ్బంది కలగకుండా సకాలములో రోడ్డు మరమ్మతులు పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ ఈఈ దుర్గాప్రసాడ్ ను ఆదేశించారు. ఈ తనిఖీలో పాల్వంచ తహసిల్దార్ హిమబిందు, మండల అభివృద్ధి అధికారి కే. శ్రీనివాస్, పంచాయతీ రాజ్ డిప్యూటీ ఈఈ స్వామి దాస్, ఏఈఈ సంజయ్ తదితరులు ఉన్నారు.
రోడ్డు పునరుద్ధరణ పనులను పరిశీలించిన కలెక్టర్
- Advertisement -
- Advertisement -



