- Advertisement -
నవతెలంగాణ-నవాబుపేట
మండల పరిధిలోని చెన్నారెడ్డి పల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా మైసమ్మ పోచమ్మ బోనాలు పండుగ జరిగింది. గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు నైవేద్యం, కోడిపుంజులతో మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నవనీతరవి యాదవ్ మాట్లాడుతూ.. ప్రతి ఏటా శ్రావణమాసంలో గ్రామ దేవతల ఆరాధన చేసి మొక్కులు తీర్చుకుంటామని చెప్పారు. పూర్వం నుంచి పెద్దల సూచనల మేరకు మైసమ్మ పోచమ్మ బోనాల పండుగ జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముంత యాదయ్య ముంత నర్సింహులు ఆనంద్ జైపాల్ గ్రామపెద్దలు ప్రజలు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -



