Sunday, September 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలు సుఖశాంతులతో ఉండాలి

విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలు సుఖశాంతులతో ఉండాలి

- Advertisement -

తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు

విఘ్నేశ్వరుని ఆశీస్సులతో మండల ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఐశ్వర్యాలతో ఉండాలని తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వినాయక చవితి సందర్భంగా మండల ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ నిర్వహించాలని కోరారు. పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి పూజించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ వినాయక చవితి ఉత్సవాలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -