– సత్తుపల్లి జర్నలిస్ట్ జేఏసీ సమావేశంలో సీనియర్ నాయకులు
నవతెలంగాణ-సత్తుపల్లి
జర్నలిస్టులు ఐక్యంగా ఉంటేనే ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయని సీనియర్ జర్నలిస్ట్ నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం సత్తుపల్లిలో జర్నలిస్ట్ జేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ప్రతినిధులు మాట్లాడుతూ.. యూనియన్లు, ప్రెస్ క్లబ్‌లకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
సమస్యల సాధనకు అందరూ ఒకే వేదికపైకి వచ్చి జేఏసీగా ఏర్పడటం శుభపరిణామమని కొనియాడారు. జర్నలిస్టుల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు ఉన్నా, భవిష్యత్తులో అందరం కలిసి చర్చించుకుని ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకోవాలని నిశ్చయించారు. హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సంక్షేమంపై సుదీర్ఘంగా చర్చించి, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశారు. జర్నలిస్టులందరూ ఒకే తాటిపైకి వచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో సీనియర్ నాయకులు మాదిరాజు సుధాకర్, మొహమ్మద్ షైబుద్దీన్, చీనేని బాలకృష్ణ (బాలు), బీవీ రామారావు, రామిశెట్టి లక్ష్మణరావు, తడికమళ్ల దేవదానం, చక్రపు త్రిమూర్తులు, బొల్లిపోగు సురేష్, నిమ్మగడ్డ శ్రీకాంత్, కందుల గురవయ్య, చీపు గంగాధర్ గౌడ్, తడికమళ్ల అప్పారావు, బల్లెం చిరంజీవి, జమ్ముల రాజేష్ రెడ్డి, బర్రె రామకృష్ణ, ఎస్కే మీరా, ఐ.శ్రీను, కొత్తపల్లి సుధాకర్, ఎస్కే బాజీ, ఎండి రఫీ, ఎండి మేరాజ్, మహా శ్రీను, లింగగిరి రామకృష్ణ, బేతి ఆనంద్, కలువకొలను సతీష్ పాల్గొన్నారు.



