Sunday, September 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వ్యవసాయ బావిలో పడ్డ నక్కలు 

వ్యవసాయ బావిలో పడ్డ నక్కలు 

- Advertisement -

– సురక్షితంగా బయటకు తీసిన ఫారెస్ట్ అధికారులు 
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్

హుస్నాబాద్ మండలంలోని మాలపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో శనివారం రాత్రి రెండు నక్కలు పడ్డాయి. గమనించిన రైతులు గ్రామ సర్పంచ్ వెన్న స్వర్ణలత రాజుకు విషయం తెలిపారు. దీంతో సర్పంచ్ ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా విషయం తెలుసుకున్న అధికారులు అర్ధరాత్రి సంఘటన స్థలానికి చేరుకున్నారు. బావిలోకి దిగిన ఫారెస్ట్ సిబ్బంది నక్కలను బోన్  సహాయంతో బయటకి తీశారు. అనంతరం  సురక్షితంగా ఉన్న నక్కలను శివారులో అటవీ ప్రాంతంలో వదిలేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -