Sunday, September 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభారత్ - ఆఫ్ఘనిస్థాన్‌ తొలి టీ20కి వర్షం ముప్పు

భారత్ – ఆఫ్ఘనిస్థాన్‌ తొలి టీ20కి వర్షం ముప్పు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భారత్‌, ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా ఆదివారం మ్యాచ్‌ జరగనుండగా.. వాతావరణ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. మ్యాచ్‌ సమయంలో వర్షం కురిసే అవకాశం ఉండటంతో క్రికెట్‌ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఢిల్లీలో ఆదివారం వర్షం కురిసే అవకాశం 64 శాతంగా ఉంది. సాయంత్రం 7 గంటల సమయంలో వర్షం పడే అవకాశం 37 నుంచి 40 శాతం వరకు ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి. దీంతో మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభం కావడం లేదా ప్రారంభమైన తర్వాత వర్షం కారణంగా అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సిరీస్‌లోని మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లు కూడా సెప్టెంబర్‌ 15, 17 తేదీల్లో అరుణ్‌ జైట్లీ స్టేడియంలోనే జరగనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -