Sunday, September 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్‌లో అర్ధరాత్రి భారీ వర్షం

హైదరాబాద్‌లో అర్ధరాత్రి భారీ వర్షం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌ : హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, జేఎన్‌టీయూ, మూసాపేట్, ప్రగతినగర్‌, బాచుపల్లి, కేపీహెచ్‌బీ, నిజాంపేట్‌తో పాటు మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్‌, లింగంపల్లి, చందానగర్‌, మియాపూర్‌ ప్రాంతాల్లోనూ వర్షం పడుతోంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా ఉండగా.. వర్షంతో వాతావరణం చల్లబడింది. రోడ్లపై వర్షం కారణంగా వాహనదారులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. గణేశ్‌ విగ్రహాలను మండపాలకు తరలించడానికీ ఆటంకం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -