- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేశ్ మండపాలకు భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ నెల 14 నుంచి 24 వరకు జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని సంస్థ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. జేబీఎస్ నుంచి ఉదయం 6 గంటలకు మొదటి సర్వీస్ ప్రారంభమై రాత్రి 9.55 వరకు ప్రతీ 40-50 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. బాలాపూర్ నుంచి తిరుగు ప్రయాణ బస్సులు ఉదయం 7.55 నుంచి రాత్రి 11.50 వరకు నడుస్తాయి.
- Advertisement -



