Sunday, September 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బహుదూర్ పేటలో ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి

బహుదూర్ పేటలో ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు మున్సిపల్ కేంద్రంలోని బహదూర్ పేట, ఆరో వార్డులో ప్రముఖుల విగ్రహాల ఏర్పాటు చేయాలని, అందుకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ కౌన్సిలర్లు కృషి చేయాలని, కవి షేక్ జానీ మియా ఆదివారం విలేకరులకు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆలేరు మున్సిపాలిటీలో విలీనానికి ముందు బహుదూర్పేట గ్రామపంచాయతీ అని, స్వతంత్రం వచ్చి 80 ఏండ్లు దాటుతున్న ఇంత వరకు మనకు స్వాతంత్రమ్ తెచ్చిన మహనీయుల విగ్రహాలు లేకపోవడం శోచనీయమన్నారు.

ప్రజా ప్రతినిధులు ఈ అంశంపై స్పందించి బహదూర్ పేటలోని పేరుగాంచిన పాత కచ్చేరి వద్ద  మహాత్ముని విగ్రహాన్ని ఆవిష్కరణ చేసి ఏర్పాటుకు కృషి చేయాలనీ చెప్పారు. సుద్దగడ్డ అని పిలువ బడే కాలనీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయం లో స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ప్రజల బాగోగులు కొరకు ఇల్లు లేని వాళ్లకు భూమిని కొనుగోలు చేసి పేద ప్రజలకు ఇంటి పట్టాలు ఇప్పించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టారు.

ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో అట్టి సుద్దగడ్డకు ఇందిరా నగర్ అని పేరు పెట్టి ఆ మహనీయులారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయించాలని కోరారు. స్వర్గీయ ఇందిరా గాంధీ పేరు ప్రక్యాతలు చీర స్థాయిగా నిలుపుతూ గ్రామ అభివృద్ధికి తొడపాడాలని షేక్ జానీ మియా పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -