నవతెలంగాణ – తొగుట
మన రజక సమాజం ఎన్నో సంవత్సరాలుగా వెను కబడి ఉన్నామని బీఆర్ఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ గణేష్ చిన్నరంగారి, జిల్లా నాయకులు దీటీ రాజు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో మండల కమిటీని ఎంపిక చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. మన హక్కుల కోసం, మన భవిష్యత్, ఐక్యతే మనం బలం అన్నారు. నవంబర్ లో జిల్లాలో జరిగే 4వ మహా సభను విజయవంతం చేయాలని కోరారు. రజకుల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలు ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేయాలనీ పేర్కొన్నారు. విద్య, ఉపా ధి, ఆర్థిక అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాల్లో మన సమాజానికి తగిన గుర్తింపు, అవ కాశాలు కల్పించేందుకు మనమంతా ఐక్యంగా ముందుకు సాగాలనీ పిలుపునిచ్చారు.
ఇది రజక సమాజం సమస్యలను ముందుకు తీసుకెళ్లే ఒక బాధ్యతాయుతమైన వేదిక అని అన్నారు. మండ లంలోని ప్రతి గ్రామంలో రజక కుటుంబాలను కలు పుకొని, వారి సమస్యలను తెలుసుకొని, వాటి పరి ష్కారం కోసం నిరంతరం కృషి చేయాలన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించే ప్రతి ఒక్కరూ రజక అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని వారు కోరారు. మన సమాజానికి రాజకీయంగా బలమైన ప్రాతినిధ్యం సాధించాలి. మండలంలోని ప్రతి రజక కుటుంబం ఒక్కటిగా నిలబడాలని సూచించారు. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో తొగుట మండల నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
మండల అధ్యక్షులుగా గణపతి చందు (ఘనపూర్), యూత్ అధ్యక్షుడు నిమ్మరాజు నరేష్ (కన్గల్), ప్రధాన కార్యదర్శి ముత్యాల నర్సింలు (బండారు పల్లి), కోశాధికారి వి. స్వామి (లింగపూర్), ఉప అధ్యక్షులు గా పోతరాజు స్వామి (కన్గల్), రేబర్తి మల్లయ్య (బండారుపల్లి), జూపల్లి బాలయ్య (వెంకట్రావుపేట), లింగంపల్లి స్వామి (లింగపూర్), గా నియమించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సత్తు యాదగిరి (తొగుట), లింగంపల్లి బాలయ్య (వెంకట్రావుపేట), లు వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్ (తొగుట), సోషల్ మీడియా కార్యదర్శి భాను (ఘనపూర్), కార్యదర్శి ఏ.కిషన్ (పెద్ద మసాన్ పల్లి) జిల్లా నాయకులు రాచకొండ నందు, గణపతి నర్సింలు, గ్రామ అధ్య క్షులు నర్సింలు, కుమారస్వామి, పోతరాజు స్వామి, లింగంపల్లి రాజయ్య, ఆంజనేయులు, గణపతి లింగం, దొంతి మల్లయ్య, నాగరాజు, కనకయ్య, అక్కరాజు భూమయ్య, వి. స్వామి మైసయ్య, రాజయ్య, భూములు, లు తదితరులు పాల్గొన్నారు.



