- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : శాసనమండలిలో జరిగిన తీరుకు సీఎం రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలని.. సభ హుందాతనాన్ని వమ్ము చేశారని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ బయట తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడం కుట్ర అని, తాను పింక్ టీ షర్ట్ వేసుకున్నా సభలోనికి వెళ్లనివ్వలేదని అన్నారు. ముందస్తు ప్రణాళికలో భాగంగానే మొదటి రోజు సభలోకి రానివ్వలేదని, ఎలాంటి చర్చ లేకుండానే తమ సభ్యులను సస్పెండ్ చేశారని ఆరోపించారు.
- Advertisement -


