- Advertisement -
నవతెలంగాణ-నెల్లికుదురు
నెల్లికుదురు నూతన ఎస్‌ఐగా భాద్యతలు చేపట్టిన గంగారపు కర్ణాకర్ ను మహాదేవ్ డిమార్ట్ యజమాన్యం సవీన్ శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆదివారం మట్టి వినాయకుడిని స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ కరుణాకర్ కు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నిర్వహించే వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఒకరోజు ముందు మహాదేవ్ డిమార్ట్ ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పంపిణీ చేస్తామనీ, అందులో భాగంగా ఆదివారం పోలీసులకు అందించినట్లు తెలిపారు. మట్టి వినాయకుడిని పూజించండి కాలుష్యాన్ని నివారించండి అని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో యజమాన్య బృందం పాల్గొన్నారు.
- Advertisement -


