No menu items!
Sunday, August 24, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్వ్యాపారస్తులందరూ స్వచ్ఛతకు సహకరించాలి 

వ్యాపారస్తులందరూ స్వచ్ఛతకు సహకరించాలి 

- Advertisement -

మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
: పట్టణంలోని వ్యాపారస్తులందరూ స్వచ్ఛతకు సహకరించాలని, స్వచ్ హుస్నాబాద్ లో భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ కోరారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో వస్త్ర వ్యాపార యజమానులు, దుకాణ యజమానులు, ట్రేడర్స్, చికెన్ మటన్ షాప్ యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చికెన్,మటన్ వ్యర్థాలను సాయంత్రం వచ్చే వాహనానికి మాత్రమే అందించాలని తెలియజేశారు. పట్టణ ప్రజలందరూ బయటకు వచ్చినప్పుడు బహిరంగ మలమూత్ర విసర్జన చేయకూడదని, పబ్లిక్ టాయిలెట్స్ ని వాడాలని అన్నారు. మార్కెట్ కి వెళ్లేటప్పుడు జ్యూట్ బ్యాగులు తమ వెంట తీసుకెళ్లాలని తెలిపారు.  ప్రతి ఒక్కరు కూడా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని, సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకూడదని అన్నారు.ఈ కార్యక్రమంలో వస్త్ర వ్యాపార సంఘం ప్రెసిడెంట్ రాజయ్య , కిరాణా వర్తక సంఘం ప్రెసిడెంట్ శ్రీధర్, అసిస్టెంట్ ఇంజినీర్ పృద్వి, ఇన్చార్జి మేనేజర్ సంపత్ రావు, సానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం, పర్యావరణ అధికారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు .

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad