Monday, February 2, 2026
E-PAPER
Homeజిల్లాలుఉపాధి కూలీలంతా కేంద్రంపై ఉద్యమించాలి

ఉపాధి కూలీలంతా కేంద్రంపై ఉద్యమించాలి

- Advertisement -

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కుట్ర
ఏఐసీసీ సెక్రెటరీ మీనాక్షి నటరాజన్ 
నవతెలంగాణ – అచ్చంపేట
పని చేసుకునే(మ‌హాత్మగాంధీ ఉపాధీ హామీ ప‌థ‌కం) హక్కు చట్టం రద్దు చేస్తే దేశవ్యాప్తంగా కూలీలంతా ఏకమై ఐక్యతతో కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమించాలని ఏఐసీసీ సెక్రటరీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజ్ అన్నారు. ఉపాధి హామీ పథకం బచావో.. విబి జి రామ్ జి హఠావో కార్యక్రమంలో భాగంగా సోమవారం అచ్చంపేట మండలం బుడ్డ తండా గ్రామపంచాయతీలో కూలీలతో ముఖాముఖి నిర్వహించారు. 30 ఏళ్ల క్రితం రోజు కూలీ రూ. 30, 40 మాత్రమే ఉండేది. 2006లో యుపీఎస్ సర్కార్ మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ నేతృత్వంలో వలసలు నివారించి, గ్రామీణ ప్రాంతాలలో పని కల్పించాలని లక్ష్యంతో ఉపాధిహామీ పథకం ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.

వంద రోజులు పని దినాలు రోజు కూలీ రూ.200 పైగా కల్పించామని గుర్తు చేశారు. ఇలాంటి పథకానికి మోడీ ప్రభుత్వం నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తుందన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు కేటాయించేద‌ని, నేడు 60 శాతానికి నిధులు తగ్గించార‌ని మండిప‌డ్డారు. ఈ క్రమంలో ప్రధాన రహదారిపై పనులు చేస్తున్న కూలీలల‌ను ఆమె ప‌ల‌క‌రించారు. ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నార‌ని, రోజు కూలీ ఎంత వస్తుందని అడిగి తెలుసుకున్నారు.

అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వీడియో కాల్ చేసి మాట్లాడారు. కూలీలతో స్వయంగా సీఎం వీడియో కాల్ లో మాట్లాడారు. కార్యక్రమంలో ప్రధానంగా పని దినాలు, వేత‌నం పెంచాలని, ఉపాధి చేసుకునే అవకాశం కల్పించాలంటూ ఈ ప్రధానమైన డిమాండ్లు అమలు చేయాలని గ్రామ సభలో తీర్మానం చేశారు. అంతకు ముందు మీనాక్షి నటరాజన్ కు గిరిజనులు డప్పు చప్పులతో నృత్యాలతో స్వాగతం పలికారు. ఆమె వెంట స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మునిసిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మార్కెట్ చైర్మన్ రజిత మల్లేష్, గ్రామ సర్పంచ్ రామావత్ పార్వతి, కృష్ణా రెడ్డి, మూడవత్ శ్రీను నాయక్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -