Saturday, March 7, 2026
E-PAPER
Homeకరీంనగర్విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి

విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి

- Advertisement -
  • జెడ్పీసీఈవో గౌతమ్ రెడ్డి
  • నవతెలంగాణ – రాయికల్
  • మండలంలోని అల్లీపూర్, సింగర్‌రావుపేట మహాత్మా జ్యోతిబాపూలే (బాలుర) గురుకుల పాఠశాలను జెడ్పీసీఈవో గౌతమ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల, వసతి గృహం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పిచ్చి మొక్కలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు వండుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, వంటలు గ్యాస్ పొయ్యిపైనే వండాలని, కూరగాయలు తాజాగా ఉండేలా చూడాలని సూచించారు. అలాగే వంట సరుకుల నాణ్యతను నిరంతరం పరిశీలించాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడి భోజన వసతుల గురించి తెలుసుకున్న ఆయన ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే క్రమశిక్షణతో చదవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈవో నరేష్, ఎంపీడీవో బింగి చిరంజీవి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -