జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ప్రభుత్వ కార్యకలాపాల ఫైలు ఆన్లైన్ లోనే వేగంగా ఫైళ్ళ పరిష్కారం చూపడం జరుగుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అన్ని శాఖల జిల్లా అధికారులతో ఈ-ఆఫీస్ నిర్వహణ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిపాలనలో మరింత వేగం, పారదర్శకత, పర్యవేక్షణ పెంచేందుకు అన్ని ప్రభుత్వ శాఖల్లో కార్యకలాపాలు ఆన్లైన్లోనే జరగాలని జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారులకు ఆదేశించారు. ఏప్రిల్’01-2026 నుండి అన్ని శాఖల్లో ప్రతి ఫైలును ఆన్లైన్లోనే నిర్వహించాలన్నారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి విభాగం నుండి సాధారణ పరిపాలన వరకు అన్ని ఈ-ఆఫీస్ ద్వారానే ఫైళ్ల పరిష్కారం జరుగుతాయని అన్నారు. ఈ ఆఫీస్ తో ప్రభుత్వ అధికారులకు సులభంగా పనులు జరుగుతాయని,అలాగే వేగంగా ఫైళ్ళ కదలిక పూర్తవడంతోపాటు పారదర్శకత ఉంటుందన్నారు.
కలెక్టరేట్ లోని ఏ.బి.సి.డి.ఈ,తదితర సెక్షన్ లోని అధికారులు సాధారణ పరిపాలనతో పాటు రెవెన్యూ, లా అండ్ ఆర్డర్, భూ సేకరణ, ప్రభుత్వ భూములు, కోర్టు కేసులు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ శాఖలో సంబంధిత ఉద్యోగుల పేరుతోనే (నేమ్ బెస్ట్ మెయిల్ ఐడి) క్రియేట్ అవుతుందన్నారు. మెయిల్ ఐడి తోనే అధికారుల అన్ని విధులు ఆన్లైన్లో కొనసాగించాలన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులకు టోకెన్లు ఇవ్వడం జరిగిందని ఇకనుండి టోకెన్ల ద్వారానే ఈ సైన్ ద్వారానే ఫైళ్ళ పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు.వీటితోపాటు జిల్లాలో ఆయా శాఖల పరిధిలో అభివృద్ధి, సంక్షేమ పరిపాలన విధులకు సంబంధించినవి ఆ శాఖ విభాగాధిపతి నుంచి జిల్లా కలెక్టర్ కు చేరుతాయన్నారు. ఈ ఫైలు అన్ని దాదాపు ఆన్లైన్లోనే కలెక్టర్ వద్దకు చేరుతాయని కలెక్టర్ ఆ ఫైలను పరిశీలించి తదుపరి చర్యలకై పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు. భూభారతి, ప్రజా పాలన తదితర దరఖాస్తుల పరిష్కారం ఆన్లైన్ ద్వారానే నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ సూచించారు.
అనంతరం ఈ ఆఫీస్ నిర్వహణ పై అన్ని శాఖల అధికారులకు, సిబ్బందికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ డిస్టిక్ మేనేజర్ వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జయమ్మ, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఈ. డిస్టిక్ మేనేజర్ సాయి కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.



