Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జర్నలిస్టులందరూ బీమా సౌకర్యం కలిగి ఉండాలి..

జర్నలిస్టులందరూ బీమా సౌకర్యం కలిగి ఉండాలి..

- Advertisement -

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
తెలంగాణ రాష్ట్రంలో మీడియా రంగంలో కొనసాగుతున్న ప్రతి జర్నలిస్టు బీమా సౌకర్యం కలిగి ఉండాలని ప్రతి జర్నలిస్టు వారి వారి కుటుంబాలకు ఆర్థికపరమైన భరోసా కల్పించే విధంగా నడుచుకోవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో (టీఎస్ జే ఏ) అసోసియేషన్ కార్యాలయంలో అసోసియేషన్ లో కొనసాగుతున్న జర్నలిస్టులకు రెండు లక్షల ప్రమాద బీమాకు సంబంధించిన బాండ్లను అందించి మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ సౌకర్యాన్ని ప్రతి జర్నలిస్టు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గుంటి శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు దుస్సా చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఉమ్మడి జిల్లాల నాయకులు జిల్లా నాయకులు మండలాల పట్టణాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -