Wednesday, April 1, 2026
E-PAPER
Homeసినిమాఅవన్నీ నిరాధార ఆరోపణలే..

అవన్నీ నిరాధార ఆరోపణలే..

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమలో నటి హేమకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆమె, తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
అదే సమయంలో నేరుగా, బహిరంగంగా తన అభిప్రాయాలను చెప్పే స్వభావం వల్ల కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
టాలీవుడ్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా దశాబ్దాల పాటు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి హేమ. ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నటి హేమతో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల నటి హేమకు క్లీన్‌ చీట్‌ వచ్చింది. తనపై నమోదైన డ్రగ్స్‌ కేసు, దాని వల్ల తన కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులు, మీడియా పాత్ర వంటి అంశాలపై భావోద్వేగంగా స్పందించారు. హేమ మాట్లాడుతూ, ‘డ్రగ్స్‌ కేసులో నాపై వచ్చిన ఆరోపణలు నన్ను తీవ్రంగా మానసికంగా కలచివేశాయి. ఆ సమయంలో నాకు చచ్చిపోవాలనిపించింది. అంత మానసికంగా కుంగిపోయాను. అయితే నేను ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే చివరకు నిర్దోషిగా బయటకు వచ్చాను. డ్రగ్స్‌ వ్యవహారంలో కొందరు మీడియా సంస్థలు నాపై నిరాధార ఆరోపణలు చేస్తూ బురదజల్లాయి. ఆ వార్తల కారణంగా నా వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా బాధపడ్డారు’ అని తెలిపారు.
‘మీడియా విషయంలో నటి హేమ ఆవేదనతో ఉన్నారు. తన మనసులోని మాటను పంచుకునేందుకు ఈరోజు మీట్‌ ది ప్రెస్‌కు ఆహ్వానించాము. ఆమె అభిప్రాయాలను మీడియా ముఖంగా పంచుకునే వేదిక ఇది. హేమ చెబుతున్నట్టు, ఆమెనే కాదు, మేము జర్నలిస్టులం కూడా వివక్ష ఎదుర్కొన్నాం’ అని ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బత్తుల ప్రసాద్‌ రావు అన్నారు. ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షులు ప్రభు మాట్లాడుతూ,’చిత్ర పరిశ్రమతో మీడియా ఎప్పుడూ స్నేహపూర్వకంగానే ఉంటూ వచ్చింది. ఈ మధ్య సోషల్‌ మీడియాల వల్ల కొన్ని తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. హేమ తన నిర్దోషిత్వాన్ని కోర్టులో నిరూపించుకుంది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -