Sunday, November 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీ రిజర్వేషన్ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి

బీసీ రిజర్వేషన్ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి

- Advertisement -

బీసీ జేఏసీ కన్వీనర్ బంటు వెంకటేశ్వర్లు 
నవతెలంగాణ – మిర్యాలగూడ 

బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జేఏసీ ఇచ్చిన రాష్ట్ర పిలుపుమేరకు ఆదివారం పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా దగ్గర నుంచి సాగర్ రోడ్ లోని పూలే విగ్రహం వరకు రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతో రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ పట్టణ కన్వీనర్ బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ  రేవంత్ రెడ్డి  బీసీ రిజర్వేషన్ల కోసం  అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.  డిసెంబర్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ కూటమిలో ఉన్నటువంటి ఇండియా భాగస్వామ్య పక్షాలు పార్లమెంట్లో బిజెపిని నిలదీయాలన్నారు. బీసీల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న బిజెపి ఎంపీలు  రిజర్వేషన్ల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఉండడం సరికాదన్నారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే వారికి తగిన బుద్ధి చెప్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ మిర్యాలగూడ నియోజవర్గ అధ్యక్షులు గుండెబోయిన నాగేశ్వరావు యాదవ్, ప్రముఖ సామాజికవేత్త జాడి రాజు, బీసీ విద్యార్థి సంఘం జేఏసీ అధ్యక్షులు గాదగోని మహేష్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి దుర్గయ్య రజక, బీసీ యువజన సంఘం పట్టణ కార్యదర్శి దోనేటి శేఖర్ ముదిరాజ్, వడ్డెర సంఘం నాయకులు వద్దిరాజ్ రాజ్ కుమార్,డివిఆర్ యాదవ్ యాదవ సంఘం జిల్లా నాయకులు అంజి బాబు యాదవ్ బీసీ సంఘం నాయకులు పి చైతన్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -